‘మెహబూబా’ తెలుగు మూవీ రివ్యూ మరియు రేటింగ్

మెహబూబా సినిమా రివ్యూ: పూరీ మార్కు ప్రేమకథ

సినిమా పేరు : మెహబూబా.

నటి నటులు : ఆకాశ్ పూరి. నేహ శెట్టి,  విష్ణు రెడ్డి, షాయాజీ షిండే.

దర్శకత్వం :పూరి జగన్నాద్.

నిర్మాత :పూరి కనేక్ట్స్.

సంగీతం :సందీప్ చౌతా.

పూరి జగన్నాద్ సినిమాలు అంటేనే మనకు పోకిరి, టెంపర్, బిజినెస్ మాన్ లాంటి సినిమాలే గుర్తుకస్తాయి. పూరి జగన్నాద్ అంటేనే డైలాగ్స్, టేకింగ్’లతో ఎంతగానో ఆకట్టుకున్న పూరి ఈ మద్య వరుస పరాజయాలతో కొద్దిగా ఇబ్బంది పడిన సంగతి అందరికి తెలిసిందే. ఇలాంటి సమయంలో తన కుమారుడు ఆకాశ్ పూరిని పరిచయం ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. నేహశెట్టి కూడా ఈ సినిమాతో హీరోయిన్’గా పరిచయం అవుతుంది. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పోస్టర్లు, ట్రైలర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి మరి సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? పూరి ఈ సినిమాతో మళ్ళితన గత వైభవాన్ని అందుకున్నాడ అనే విషయాన్నీ మనం సమీక్షలోకి వెళ్లి తెలుస్సుకుందాం.

మెహబూబా చిత్ర కథ: 

రోషన్ (ఆకాశ్ పూరి) అమితమైన దేశభక్తి కలిగిన యువకుడు. సైన్యంలో చేరాలనే తపనతో ఉంటాడు. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేయడమంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటె రోషన్ కి చిన్నపడి నుంచి ఎవరో చంపేసినట్టు, తను ఎవరినో ప్రేమించినట్టు రకరకాల కలలు వస్తుంటాయి. అదే సమయంలో పాకిస్తాన్ లో ఉండే అఫ్రీన్(నేహ శెట్టి) అనే అమ్మయికి కూడా అలానే అనిపిస్తుంది.

ఐతే రోషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మిలిటరీలో చేరాలని చూస్తుంటాడు. అదే సమయంలో అఫ్రీన్ కూడా చదువు కోసం ఇండియాకు రావాలని అనుకుంటుంది. ఇంట్లో వాళ్ళు బయపడుతున్న అఫ్రీన్ ఇండియాకు వస్తుంది. అఫ్రీన్‌ను పెళ్లి చేసుకోవాలనునే నదీన్ ఖాన్ (విష్ణు రెడ్డి) ఆమెను తన అధీనంలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అఫ్రీన్‌కు నదీన్ అంటే ఇష్టం లేనప్పటికీ తల్లితండ్రుల కోసం భరిస్తుంటుంది. 

ఇదిలా ఉంటె అఫ్రీన్ ని ఒక సమయంలో రోషన్ కాపాడుతాడు. కానీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకపోవడంతో అఫ్రీన్ తనను కాపాడిన వాళ్ళకి థాంక్స్ చెప్పాలని అనుకుంటుంది. అలా ఒకరోజు అఫ్రీన్ రోషన్ ని ట్రైన్ లో చూస్తుంది చుసుకోగానే ఇద్దరికీ ఒకరికిఒకరు ఎక్కడో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడ కలిసారో గుర్తుకు రారు. అఫ్రీన్ పాకిస్తాన్ కి వెళ్లి పోతుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్  చేస్తున్న రోషన్ కి గతం ఎలా గుర్తుకోచింది.అఫ్రీన్ ని వెతుకుంటూ పాకిస్తాన్ వెళ్ళిన రోషన్ ఎకటి పరిస్తితులు ఎదురుకుంటాడు. రోషన్ తెలుసుకున్న విషయాలేవి. వీరిద్దరూ ఎలా కలుసుకుంటారు అనేదే కథ.

 విశ్లేషణ :

పూర్వజన్మల కాన్సెప్ట్‌తో తెలుగులో వచ్చిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సాదాసీదాగా నడిపించారు. హీరోగా ఆకాష్ పూరిని ఎలివేట్ చేయడానికి పూరి చాలా కష్టపడ్డాడు. దాదాపు సినిమా మొత్తం ఆకాష్ ఎలివేషన్ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సందేహాల నడుమ ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.  హీరోగా ఆకాష్ పూరి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నేహాశెట్టికి తెలుగులో ఇది మొదటి సినిమా. తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. 

క్లైమాక్స్ లో ‘ఇస్లాం జిందాబాద్ అని ఒప్పుకున్నవాడు.. పాకిస్థాన్ జిందాబాద్ అనడానికి మాత్రం అంగీకరించడు’ ఇది ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా చేసింది. హీరో తండ్రిగా షాయాజీ షిండే అక్కడక్కడా నవ్వించాడు. సాంకేతికంగా ఈ సినిమాను మంచి విలువలతో నిర్మించారు. సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. 

అయితే నేహశెట్టి  ఆకాష్ పూరీ పక్కన కాస్త పెద్దగా కనిపించింది. మిగిలిన పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా సరిగ్గా లేదు. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ చూపాల్సివుంది. కథనాన్ని నడిపించిన తీరు కొత్తగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీయడంలో పూరి కనెక్ట్స్ విఫలమైందనే చెప్పాలి. 

  టాలీవుడ్ మోజో రేటింగ్ : 2/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

WpCoderX