‘మహానటి’మొదటి రోజు వసూళ్లు.. స్టార్ హీరోలకు ధీటుగా…

‘మహానటి’మొదటి రోజు వసూళ్లు..

‘మహానటి’మొదటి రోజు వసూళ్లు.. స్టార్ హీరోలకు షాక్…

మహానటి సావిత్రి గారి జీవిత కథ ఆదరంగా నిన్న విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి గారి పాత్రను కీర్తి సురేష్ పోషించింది. స్టార్ హీరోలందరూ ఈ సినిమాని పొగుడుతూ వచ్చారు. తన సినిమాలో కీర్తి సురేష్’ని చూసిన వాళ్ళందరూ సావిత్రి గారిని చూసినట్టే అనిపించేలా ఒదిగిపోయింది కీర్తి. దుల్కుఎర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత అక్కినేని, నాగ చైతన్య, ప్రకాష్ రాజ్, రాజ్రెంద్రప్రసాద్ తమ తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేసారు. వైజయంతి మూవీస్ ఈ సినిమాని నిర్మించింది.

అయితే ఈ సినిమాకి స్టార్ హీరోల సినిమాకి దీటుగా బారి ఓపెనింగ్స్ దక్కినట్టుగా ట్రేడ్ రిపోర్ట్ దక్కింది. యు.ఎస్. లో ఐతే మహానటి వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. రిలీస్ ఐన మొదటి రోజే ప్రిమియర్స్ తో దాదాపు మూడు లక్షల డాలర్స్ వసూళ్ళు కొల్లగోట్టిందని సమాచారం. స్టార్ హీరో సినిమాల వసూళ్ళు కూడా దాదాపు కొద్దిగా ఇలానే ఉంటాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఐతే సినిమా భారి వసుళ్ళనే సాదించింది. ఈ సినిమా మొదటి రోజు వసూళ్ళు అల్లు అర్జున్ నా పేరు సూర్య మూవీని మించి కలెక్షన్ రాబట్టిందని ట్రేడ్ సమాచారం.

ఈ వసూళ్ళన్ని కేవలం ఒక్క రోజువి మాత్రమె. మహానటి రివ్యూలన్నిపాజిటివ్ గా రావడంతో పాటు ప్రతి ఒక్కరు సినిమాని మేచుకోవడంతో ఈ వీక్ మొత్తం భారీగానే వసూళ్ళు సాదించేలగా సినిమా దుసుకెల్తుంది. పాజిటివ్ టాక్, భారి అంచనాలతో ఈ సినిమా సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతుంది. యూ.ఎస్. లో మహానటి మిలియన్ డాలర్ మార్క్ అందుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఏరియా వైజ్‌ చూసుకుంటే తొలి రోజు

 నైజాం : 5.4 కోట్లు

 సీడెడ్‌ : 2.4 కోట్లు

 నెల్లూరు : 65 లక్షలు

 కృష్ణా : కోటి

 గుంటూరు : రెండున్నర కోట్లు

 వైజాగ్‌ : 2 కోట్లు

 ఈస్ట్‌ గోదావరి : 2 కోట్లు

 వెస్ట్‌ గోదావరి : 1.5 కోట్లు

 వెరసి తెలుగు రాష్ట్రాల్లో : 16.5 కోట్ల

 వరకు షేర్‌ వచ్చిందని ట్రేడ్‌ పండితులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

WpCoderX