251 రూపాయల phone గుర్తుందా? దాని ఓనర్ ఇప్పుడు ఏమంటున్నాడంటే!

కేవలం 251 రూపాయలు చెల్లిస్తే చాలు.. 3G smartphone పొందొచ్చని మీడియాలో కూడా హడావుడి జరగడంతో చాలామంది ఆశపడి ఒకేసారి 10, 20 phoneలు బుక్ చేసుకోడవడానికి రెడీ అయ్యారు.

అప్పట్లో ఈ phone పెద్ద స్కామ్ అన్న విషయం మొదట బయటపెట్టింది “కంప్యూటర్ ఎరా”. ఆ విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. Freedom 251 డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది ఓ కేస్ ఫైల్ చెయ్యడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో Ringing Bells MD మోహిత్ గోయెల్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆర్నెల్ల జైలు శిక్ష అనుభవించి బయటకు రావడం జరిగింది.

తాజాగా Ringing Bells నుండి 3.5 కోట్ల డబ్బు తీసుకుని Freedom 251 phoneలను సప్లై చెయ్యలేదన్న కారణంగా మోహిత్ నోయిడాకి చెందిన ఇద్దరు వ్యక్తులపై కంప్లయింట్లు చెయ్యడం, వారిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపధ్యంలో మోహిత్ మాట్లాడుతూ Make in India, Start-up India నినాదంతో మొదట తాము రంగంలోకి వచ్చినా భారత ప్రభుత్వం ఎలాంటి సహకారం ఇవ్వలేదనీ, అప్పట్లో మేము మొదలు పెట్టిన పనినే Karbonn లాంటి సంస్థలు 1300కే.. JioPhoneని Jio 1500 రూపాయలకే అందిస్తూ అనుసరిస్తున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు.\

కానీ మోహిత్ ఇప్పటికీ గ్రహించనిది ఒక్కటే.. JioPhoneని అమ్మడానికి Relianceకి ఉన్న అపారమైన వ్యాపారానుభవం చాలు. అలాగే Karbonn లాంటివి కూడా 1300 ఛార్జ్ చేస్తున్నాయి, మరి 250కి ఏ సంస్థ అయినా ఇప్పటికైనా phone ఇస్తోందా? సో ప్రతీ వ్యాపారీ తన పొటెన్షియాలిటీ అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

WpCoderX