కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ మరియు రేటింగ్ :

కృష్ణార్జున యుద్ధం రివ్యూ మరియు రేటింగ్ :

నటీనటులు :  నాని,అనుపమ పరమేశ్వరన్,రుక్సర్ దిల్లాన్,బ్రహ్మాజీ

నేచురల్ స్టార్ నాని అంటే సినిమా కచ్చితంగా హిట్ అనే ఆలోచన తోనే ప్రేక్షకులు ఉంటునారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచి మొదలైన నాని విజయ పరంపర ‘ఎంసిఏ’ వరకు కొనసాగుతు వచ్చింది. ప్రతి సినిమాకి నటన పరంగానూ  మరియు కలెక్షన్ల పర్నంగాను నాని తన ప్రతిభ కనబరుస్తున్నాడు.

సినిమా ఎలా ఉన్నా నాని నటన కోసం సినిమా కి వెళ్ళే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలో నాని నటించిన తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ఈ నెల 12వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిద అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.

కృష్ణార్జున యుద్దం కథ :

కృష్ణ (నాని) చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు. చాలా ముతకగా ఉంటాడు. అదే ఊరిలో ఉండే సర్పంచ్ మనవరాలు రియా(రుక్సర్)తో ప్రేమలో పడతాడు. మరిపక్క అర్జున్(నాని) యూరప్ లో రాక్ స్టార్ అమ్మాయిలతో తిరుగుతూ జల్సాలు చేస్తుంటాడు. అలా ఒకరోజు సుబ్భలక్ష్మి(అనుపమ పరమేశ్వ్సరన్)ని చూసి ఇష్టపడతాడు. కాని అర్జున్ ప్రవర్తనతో విసిగిపోయిన సుబ్భలక్ష్మి అతని ప్రేమను వద్దని హైదరాబాదుకి వెళ్ళిపోతుంది.

కృష్ణ, అర్జున్ ఇద్దరు వాళ్ళు ప్రేమించిన అమ్మాయి కోసం ఒకేరోజు హైదరాబాద్ చేరుకుంటారు. కిడ్నాప్ చేసి అమ్మేసే ఒక గ్యాంగ్ తమ ప్రియురాళ్లను కూడా కిడ్నాప్ చేశారని తెలుసుకుంటారు.48 గంటల్లో వారిని కాపాడుకోలేకపోతే.. ఇద్దరు అమ్మాయిలను పక్క దేశానికి ఎగుమతి చేసేస్తారు. మరి కృష్ణ, అర్జున్ కిడ్నాపర్ల బారి నుండి వారి ప్రేమికురాళ్ళను కాపాడుకోగలిగారా..? లేదా..? అనేదే సినిమా.

విశ్లేషణ: 

నటుడిగా వరుస విజయాలను అందుకున్న నాని ఈసారి ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వడం కోసం డ్యూయల్ రోల్‌లో నటించాడు. కృష్ణగా నాని నటనకి వంక పెట్టలేము కాని అర్జున్ పాత్రలో రాక్ స్టార్ లా ఆటిట్యూడ్ మైంటైన్ చేయలేకపోయాడు. చిత్తూర్ యాసలో నాని మాట్లాడుతూ అందరిని అలరిచాడు. ఎమోషన్ ని పండిచడంలో నాని తన ముద్ర కనబరచాడు. నాని ఫాన్స్ కి కృష్ణార్జునయుద్ధం ఒక ఐఫీస్ట్.

 స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగించారు. కథ సాగతీస్తునట్టు కనిపించిన  ఎప్పుడైతే కృష్ణ, అర్జున్ పాత్రలు కలిసి విలన్ల మీదకు దాడికి దిగుతారో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. అనుపమ మరియు రుక్సర్ తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

హిప్ హాప్ తమిజ మ్యూజిక్ సినిమాకు అసెట్. దర్శకుడు పూర్తి స్థాయిలోఆకట్టుకోలేకపోయాడు. మొతంమీద ఒకసారి ఈ సినిమాని  చూసే ధైర్యం చేయొచ్చు.

రేటింగ్ : 2.5/5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

WpCoderX